Adivi Sesh To Play AP Police Officer In HIT 2 | Nani | Vishwak sen || Oneindia Telugu

2021-03-20 1

Hit 2 movie starated. Adivi Sesh as main lead.
#Hit2
#AdiviSesh
#Nani
#Vishwaksen

విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు టాలెంటెడ్ హీరో అడవి శేష్. కెరీర్ ఆరంభంలో విలన్‌గా మెప్పించిన అతడు.. ఆ తర్వాత హీరోగా మారాడు. అప్పటి నుంచి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మంచి పేరును తెచ్చుకున్నాడు. ఇటీవలి కాలంలో వరుసగా 'క్ష‌ణం', 'గూఢ‌చారి', 'ఎవరు' వంటి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలతో విజయాలను అందుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం మహేశ్ బాబు నిర్మాణంలో శశి కిరణ్ తిక్క తెరకెక్కిస్తోన్న 'మేజర్'లో నటిస్తున్నాడు. ఇది పట్టాలపై ఉండగానే తాజాగా తన కొత్త సినిమాను ప్రకటించాడు అడవి శేష్.